మిడిల్‌ క్లాస్‌ కుర్రాడి సమస్య ఏంటి? | MCA released on 21st December | Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌ కుర్రాడి సమస్య ఏంటి?

Oct 21 2017 6:15 AM | Updated on Oct 21 2017 6:15 AM

MCA released on 21st December

నెక్ట్స్‌ ఏంటి? అసలు, సిన్మా కథేంటి? ‘నేను లోకల్‌’తో హిట్‌ అందుకున్న హీరో నాని, నిర్మాత ‘దిల్‌’ రాజు మరో సినిమా చేస్తున్నామని అనౌన్స్‌ చేయగానే ప్రేక్షకుల్లో ఆసక్తి    ఏర్పడింది. ఆసక్తిని మరింత పెంచుతూ, ‘ఎంసీఏ’  టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అనే క్యాప్షన్‌తో! దీపావళి సందర్భంగా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని అందరికీ చూపించారు. గళ్ల లుంగీ... చేతిలో రెండు పాల ప్యాకెట్లు... ప్రతి రోజూ పలు ఏరియాల్లో కనిపించే అబ్బాయిలకు ప్రతినిధిలా నాని వచ్చేశారు.

అతడి చూపుల్లో సంతోషం కనిపిస్తోంది. మరి, అతనికున్న సమస్య ఏంటి? అది ప్రేమలోనా? పౌరుషంగా బతికే విధానంలోనా? తెలియాలంటే డిసెంబర్‌ వరకూ వెయిట్‌ చేయాల్సిందే. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌. భూమిక కీ–రోల్‌ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ మంచి మ్యూజిక్‌ ఇస్తున్నారు. ఈ చిత్రం మా బ్యానర్‌ వేల్యూను పెంచుతుంది. యాభై శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. డిసెంబర్‌ 21న సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement