రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌ | Manchu Vishnu Comments on Ram Charan Acting In Rangasthalam | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌

Aug 11 2019 1:13 PM | Updated on Aug 11 2019 1:15 PM

Manchu Vishnu Comments on Ram Charan Acting In Rangasthalam - Sakshi

66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా 7 విభాగాల్లో అవార్డులు సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో మరో అవార్డు కూడా రావాల్సింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. రంగస్థలం సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని అంతా భావించారు. 

తాజాగా హీరో మంచు విష్ణు జాతీయ అవార్డులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘అవార్డులు సాధించిన వారి విషయంలో ఎలాంటి కంప్లయింట్‌ లేకపోయినా.. రంగస్థలంలో సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రామ్‌ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకునే అర్హత ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ నటన. ఏది ఏమైన అభిమానుల ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్‌’ అంటూ ట్వీట్ చేశాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రంగస్థలంలో చిట్టి బాబు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు రామ్‌చరణ్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement