హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్‌ | Manager Cheat Comedian Senthil In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నటుడిని మోసం చేసిన మేనేజర్‌

Nov 2 2019 7:57 AM | Updated on Nov 2 2019 8:14 AM

Manager Cheat Comedian Senthil In Tamil Nadu - Sakshi

చెన్నై ,పెరంబూరు: ప్రముఖ హాస్యనటుడు సెంథిల్‌ ఇంటిని తన ఇంటిగా పేర్కొంటూ ఇతరులకు అద్దెకు ఇచ్చి మోసానికి పాల్పడ్డ సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సాలిగ్రామంలోని భాస్కర్‌ కాలనీ 3వ వీధిలో ఉన్న ఫ్లాట్‌లో రెండవ అంతస్తు సీనియర్‌ హాస్య నటుడు సెంథిల్‌కు చెందినది. పది పోర్షన్లు కలిగిన ఈ ఫ్లాట్‌ రెండవ అంతస్తును సహాయరాజ్‌ అనే అదే ప్రాంతానికి చెందిన సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌ నెలకు రూ.2.60 కోట్లు అద్దె చొప్పున గత 2013లో తీసుకున్నాడు.ఆ విధంగా గత 6 ఏళ్లుగా క్రమం తప్పకుండా అద్దె చెల్లించిన సహాయరాజ్‌ గత 6 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో సెంధిల్‌ పలు మార్లు అతనికి ఫోన్‌ చేసినా సహాయరాజ్‌ ఫోన్‌ లిప్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం కలిగిన సెంధిల్‌ తన అపార్డుమెంట్‌కు వెళ్లి పరిశీలించారు. అక్కడ అద్దెకు ఉన్న వ్యక్తులను ప్రశ్నించగా సహాయరాజ్‌ ఈ అపార్టుమెంట్‌ తనదేనని చెప్పి కొందరికి లీజ్‌కు, మరి కొందరికి అద్దెకు ఇచ్చి లక్షల్లో డబ్బు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో సెంథిల్‌ సహాయరాజ్‌ మోసాన్ని గ్రహించి వెంటనే స్థానిక విరుగంబాక్కమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయరాజ్‌ను అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement