మహేష్ పాటల హంగామా | 'Mahesh' movie audio released | Sakshi
Sakshi News home page

మహేష్ పాటల హంగామా

Aug 15 2013 1:08 AM | Updated on Sep 15 2019 12:38 PM

మహేష్ పాటల హంగామా - Sakshi

మహేష్ పాటల హంగామా

‘‘ఒక సినిమాని ఎంత బడ్జెట్‌లో చేసినా అది సినిమాయే. చిన్నా పెద్దా అని ఉండదు. హిట్టు, ఫ్లాపు అనేది మాత్రమే ఉంటుంది. సురేష్‌గారు ఎప్పట్నుంచో నాకు తెలుసు.

‘‘ఒక సినిమాని ఎంత బడ్జెట్‌లో చేసినా అది సినిమాయే. చిన్నా పెద్దా అని ఉండదు. హిట్టు, ఫ్లాపు అనేది మాత్రమే ఉంటుంది. సురేష్‌గారు ఎప్పట్నుంచో నాకు తెలుసు. విషయం ఉన్న సినిమాలనే ఆయన విడుదల చేస్తుంటారు. ఇక, స్నేహగీతం, ప్రస్థానం అంటూ వినూత్న తరహా సినిమాలు చేస్తున్న సందీప్ భవిష్యత్తులో పెద్ద  హీరో అవుతాడు’’ అన్నారు ‘అల్లరి’ నరేష్.
 
సందీప్‌కిషన్, డింపుల్ చోపడే జంటగా  మదన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘యారుడా మహేష్’. ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్‌తో కలిసి ఎస్.కె. పిక్చర్స్ ద్వారా ‘మహేష్’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్ కొండేటి. మారుతి సమర్పకుడు. సమన్యరెడ్డి సహనిర్మాత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ‘అల్లరి’ నరేష్, నవదీప్, వరుణ్ సందేశ్ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు.
 
సీడీని నరేష్, వరుణ్‌సందేశ్, నవదీప్ ఆవిష్కరించి భీమనేని శ్రీనివాసరావు, మారుతికి ఇచ్చారు. ఈ వేడుకలో ఇంకా ఎమ్మెల్ కుమార్ చౌదరి, రవికుమార్ చౌదరి, ఆర్పీ పట్నాయక్, నారా జయశ్రీదేవి, కొడాలి వెంకటేశ్వరరావు, ఎస్‌కేఎన్, పులగం చిన్నారాయణ  తదితరులు పాల్గొన్నారు. ‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘జర్నీ’ కన్నా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. సందీప్ కిషన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది’’ అని సురేష్ చెప్పారు. తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారని, తెలుగులో కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని సందీప్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement