చెన్నైలో మహేష్‌బాబు | Mahesh Babu in Chennai for A R Murugadoss film | Sakshi
Sakshi News home page

చెన్నైలో మహేష్‌బాబు

Sep 21 2016 1:47 AM | Updated on Sep 4 2017 2:16 PM

చెన్నైలో మహేష్‌బాబు

చెన్నైలో మహేష్‌బాబు

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు చెన్నైలో మకాం పెట్టారు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్‌బాబుకు ఈ మహానగరం అంటే చాలా ఇష్టం.

 టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు చెన్నైలో మకాం పెట్టారు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్‌బాబుకు ఈ మహానగరం అంటే చాలా ఇష్టం. ఆయన నటించే చాలా చిత్రాల షూటింగులు ఇక్కడే నిర్వహిస్తుంటారు.అదే విధంగా తమిళ చిత్రాల్లో నటించాలన్న కోరిక మహేష్ బాబుకు చాలా కాలంగా ఉంది. అది ఇప్పుడు నెరవేరుతోంది.
 
  ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభమై అక్కడ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది.ఈ చిత్రం కోసం చెన్నై శివారు ప్రాంతంలో బ్రహ్మాండమైన సెట్‌ను వేసి చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర నిర్మాత మధు వెల్లడించారు. చెన్నైలో 20 రోజుల పాటు షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
  టాప్ డెరైక్టర్ ఏఆర్.మురుగదాస్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు,స్టార్ కెమెరామెన్ సంతోష్‌శివన్‌ల కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మహేష్‌బాబుకు తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మంచి పాపులారిటీ ఉందన్నారు. తమిళ ప్రజలు ఆయనపై చూపిస్తున్న ఆదరణను, ప్రోత్సాహాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. సంచలన కాంబినేషన్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే అభిప్రాయాన్ని నిర్మాత మధు వ్యక్తం చేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement