
మహేశ్‌బాబు నటిస్తోన్న తాజా చిత్రం టైటిల్‌పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటిస్తోన్న 25వ చిత్రం టైటిల్‌ని ‘కనుక్కోండి చూద్దాం’ అంటూ చిత్రబృందం ఆర్.ఐ.ఎస్.హెచ్. ఇలా.. అక్షరాలు మాత్రమే రివీల్ చేసింది.
దాంతో చాలా మంది టైటిల్ ‘రిషి’ అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. తాజాగా.. ‘‘రిషిని కలవండి.. తన ప్రయాణంలో ఈ నెల 9నుంచి మీరూ భాగస్వాములు కండి’ అని చిత్రబృందం పేర్కొంది. సో.. సినిమాలో మహేశ్‌బాబు పాత్ర పేరు ‘రిషి’ అయ్యుంటుంది. మంగళవారం ‘సాక్షి’ పేర్కొన్నట్లు ‘మహర్షి’ టైటిల్ అవుతుందేమో? అసలు టైటిల్ ఏంటి? గురువారం క్లారిటీ వచ్చేస్తుంది.