
'ఇంద్ర' సినిమాలో చిరంజీవిలా...
ఏడు సముద్రాలు దాటి వెళ్లినా సొంతగూటికి మించిన స్వర్గం ఉండదు. ఇది 100 శాతం నిజం అంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. తన తదుపరి చిత్ర షూటింగ్లో పాల్గొంటూ దాదాపు నెలరోజులకు పైగా విదేశాల్లో బిజీగా ఉన్న సందీప్ శనివారం మధ్యాహ్నమే ఊళ్లోకి దిగాడు.
ఏడు సముద్రాలు దాటి వెళ్లినా సొంతగూటికి మించిన స్వర్గం ఉండదు. ఇది 100 శాతం నిజం అంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. తన తదుపరి చిత్ర షూటింగ్లో పాల్గొంటూ దాదాపు నెలరోజులకు పైగా విదేశాల్లో బిజీగా ఉన్న సందీప్ శనివారం మధ్యాహ్నమే ఊళ్లోకి దిగాడు. 'హైదరాబాద్ లో అడుగుపెట్టగానే.. 'ఇంద్ర' సినిమాలో మెగాస్టార్ లా నేలని ముద్దు పెట్టుకోవాలనిపించింది.. లవ్యూ మై హైదరాబాద్.. మిస్ యూ' అంటూ సిటీ మీద ఉన్న ప్రేమనంతా ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. సాధారణ వ్యక్తులకైనా.. సినిమా స్టార్లకైనా.. 'హోం సిక్' కామన్ కదా!
కాగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో సందీప్ కిషన్ ,అనీషా అంబ్రోస్ జంటగా నటిస్తున్న 'రన్' చిత్రం మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో శనివారం సాయంత్రం విడుదల కానుంది.
Landed in Hyd after more than a month..Indra lo MegaStar la land avagane Nellani Muddu petukovali anipichindi..love you my Hyd..missed you:)
— Sundeep Kishan (@sundeepkishan) March 12, 2016