యంగ్ హీరోకి వింత అనుభవం! | sundeep kishan got amazon delivery by unknown booking item | Sakshi
Sakshi News home page

యంగ్ హీరోకి వింత అనుభవం!

Dec 21 2016 9:04 AM | Updated on Sep 15 2019 12:38 PM

యంగ్ హీరోకి వింత అనుభవం! - Sakshi

యంగ్ హీరోకి వింత అనుభవం!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌కి ఓ వింత అనుభవం గురించి తన ట్విట్టర్ ఫాలోయర్స్ తో షేర్ చేసుకున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌కి ఓ వింత అనుభవం గురించి తన ట్విట్టర్ ఫాలోయర్స్ తో షేర్ చేసుకున్నాడు. ఆన్ లైన్ షాపింగ్ అమెజాన్ లో ఎవరో తనకోసం కొన్ని వస్తువులు ఆర్డర్ చేశారని, నేరుగా డెలివరీ బాయ్ కి తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేశారని ట్వీట్ చేశాడు. డెలివరీ బాయ్ సందీప్ నెంబర్‌కు కాల్ చేసి తన ఇంటి బయట ఉన్నానని.. పార్సిల్ వచ్చిందని చెప్పేశాడు. పార్సిల్ గురించి వినగానే తాను ఆశ్చర్యపోవాలో.. లేక భయపడాలో తనకు అర్ధం కాలేదని మరో ట్వీట్ చేశాడు.

'ఐటమ్ డెలివరీ తీసుకోవడానికి ఇంటికి వెళ్లి పార్సిల్ తీసుకున్నాను. అయితే నా కాంటాక్ట్ నంబరు, చిరునామా వాళ్లకు ఎలా తెలిసింది. ఈ పార్సిల్ నా ఫ్రెండ్స్ చేసిన పని కాదని చెప్పవచ్చు. ఎందుకంటే నన్ను ఆట పట్టించడానికి అయినా సరే నా కాంటాక్ట్ నంబరు డెలివరీ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వరు కదా' అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఈ యంగ్ హీరోకి వచ్చిన అమెజాన్‌ పార్సిల్‌లో క్రిస్మస్ విషెస్‌, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలుపుతూ గ్రీటింగ్‌ కార్డు, ఓ షార్ట్ పంపించారు. చివరగా ఫ్రమ్ సీక్రెట్ శాంటా అని రాసి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement