అడ్డంకులను ఎదురొడ్డి వస్తున్న స్టార్ హీరో సినిమా

line clear for mersal release

షరామామూలుగానే అడ్డంకులను ఎదురొడ్డి ఇళయదళపతి విజయ్ నటించిన మెర్శల్‌ చిత్రం వెండితరపైకి వచ్చేస్తోంది. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ నిర్మించ్డిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్ సంగీత బాణీలను అందించారు. సమంత, కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించిన ఈ భారీ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ముందుగానే వెల్లడించారు.

అయితే ఆ మధ్య చిత్రటైటిల్‌ వ్యవహారంలో కోర్టుకెళ్లి సాధించుకున్న మెర్శల్‌కు విడుదల దగ్గర పడుతున్న సమయంలో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌)ను ఇవ్వడానికి నిరాకరించడంతో అటు చిత్ర వర్గాల్లోనూ, ఇటు విజయ్‌ అభిమానుల్లోనూ టెన్షన్ మొదలైంది.

రాజకీయ హస్తం ఉందా?
మెర్శల్‌ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ నుంచి ఎన్ ఓసీ రాకపోవడంపై చిత్రవర్గాల్లో రకరకాల ప్రసారం జోరందుకుంది. దీనికి వెనుక రాజకీయ హస్తం ఉందంటూ కొందరు ఆరోపించడం కలకలానికి తెరలేపినట్లయ్యింది. ఈ సమయాల్లో విజయ్‌ ముఖ్యమంత్రులను కలవడం పరిపాటిగా మారింది. ఇంతకు ముందు కూడా తలైవా చిత్ర విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలిశారు.

ఇప్పుడు ఎడపాటి పళనిస్వామిని కూడా కలిశారు. ఇలా ముఖ్యమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసుకోవలసిన పరిస్థితి విజయ్‌కు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. కాగా చిత్రం బుధవారం విడుదల కావలసి ఉంది. సోమవారం మధ్యాహ్నం వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో జంతు సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి ముంబై నుంచి వచ్చి పాల్గొన్నట్లు సమాచారం.

మెర్శల్‌ చిత్రంలో జంతువులకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని, అందుకు తగిన ఆధారాలను చిత్ర వర్గాలు సమర్పించని కారణంగానే ఎ¯ŒSఓసీ ఇవ్వలేదనీ తెలిసింది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మెర్శల్‌ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ ఎ¯ŒSఓసీని అందించింది. మొత్తం మీద మెర్శల్‌ అన్ని  అడ్డంకులను ఎదుర్కొని బుధవారం విడుదల కాబోతోందన్న విషయం విజయ్‌ అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top