ప్రతి సీన్‌లో మెసేజ్‌ | Sakshi
Sakshi News home page

ప్రతి సీన్‌లో మెసేజ్‌

Published Wed, Jun 19 2019 3:15 AM

ks 100 movie released on july 5 - Sakshi

సమీర్‌ఖాన్, శైలజ హీరో హీరోయిన్లుగా షేర్‌ దర్శకత్వంలో వెంకట్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘కేఎస్‌ 100’. ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా షేర్‌ మాట్లాడుతూ – ‘‘కంప్లీట్‌ ఫ్యామిలీ మూవీ. ప్రతి సీన్‌లో ఒక మెసేజ్‌ ఉంది. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన సాంగ్స్, ట్రైలర్‌తో సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది’’ అన్నారు. ‘‘సోషల్‌ మీడియాలో మా సినిమా రిలీజ్‌ ఎప్పుడు? అని అడుగుతున్నారు. మా సినిమా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ థ్యాంక్స్‌. వచ్చే నెల 5న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సమీర్‌. ‘‘దాదాపు 500ల థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. మంచి మెసేజ్‌ ఉన్న సినిమా తీశారు షేర్‌. మేకింగ్‌కి ఎంత కష్టపడ్డాడో..రిలీజ్‌కి అంతే కష్టపడ్డాడు’’ అన్నారు నిర్మాత వెంకట్‌రెడ్డి అన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement