
మహిళా పోలీసుతో షారుక్ డాన్స్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్తో కలసి పశ్చిమ బెంగాల్ మహిళా పోలీస్ అధికారి డాన్స్ చేయడం వివాదంగా మారింది.
ఓ మహిళా ఎస్ఐ.. యూనిఫాంలో ఉండి, డ్యూటీలో ఉండగానే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి డాన్స్ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అందరూ ఉండగానే ఇలా ఆమె డాన్సు చేయడంతో ఈ వ్యవహారంపై పలు విమర్శలు తలెత్తాయి. ఆమె మామూలు దుస్తుల్లో ఉండి, డ్యూటీలో లేని సమయంలో అయితే ఏం చేసినా పర్వాలేదు గానీ, యూనిఫాం ధరించి ఇలా చేయడం ఏంటని పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో కోల్కతా పోలీసుల వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మమతా బెనర్జీ, పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో షారుక్ తన చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేశారు. అదే సమయంలో యూనిఫామ్లో ఉన్న సంపా హల్దర్ అనే మహిళా ఎస్ఐ అతనితో కలసి కాలు కదిపారు. అయితే దీనిపై మాజీ ఐపీఎస్ అధికారులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మామూలు దుస్తుల్లో డాన్స్ చేసుంటే అభ్యంతరం ఉండేది కాదని, యూనిఫామ్ ధరించి డాన్స్ చేయడానికి ఉన్నతాధికారులు ఎలా అనుమతించారంటూ విమర్శించారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని పేర్కొన్నారు.