మహానటికి ఆరేళ్లు..! | Keerthy Suresh On Completing 6 Years In Cinema Share In Instagram | Sakshi
Sakshi News home page

మహానటికి ఆరేళ్లు..!

Nov 17 2019 9:05 PM | Updated on Nov 17 2019 9:19 PM

Keerthy Suresh On Completing 6 Years In Cinema Share In Instagram - Sakshi

కీర్తీ సురేష్‌ అనగానే మనకు అలనాటి నటి సావిత్రి గుర్తుకు వస్తుంది. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘మహానటి’ ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళంలో విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కీర్తీ సురేష్‌కు మం​చి గుర్తింపుతోపాటు, భారీ విజయాన్ని అందించింది. 2018 ఏడాదిగాను ఉత్తమ నటీగా జాతీయ ఆవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే కీర్తీ సురేష్‌ సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆరేళ్లు పూర్తి అయిందని తన ఇస్టాగ్రామ్‌ ఖాతాలో ఒక ఫోటో షేర్‌ చేశారు. ‘నేను నటిగా జన్మించి ఆరేళ్లు పూర్తి  అయ్యాయి. అదృష్టంతో చాలా పాత్రల్లో నటించాను. పలు పాత్రల్లో నా నటనకు పేక్షకులకు ఇచ్చిన మద్దతు, ప్రేమ, అశీర్వాదనికి చాలా కృతజ్ఞతలు. నా కలలు నిజం చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాని కృతజ్ఞతలు. నా కుంటుంబానికి, శ్రేయోభిలాషులకు శాశ్వతంగా కృతజ్ఞతలు.’ అంటూ కామెంట్‌ పెట్టారు.

కాగా, తాను చైల్డ్‌ అర్టిస్ట్‌గా నటించినప్పటికి పూర్తిస్థాయిలో హీరోయిన్‌గా చిత్రసీమలో తెరంగేట్రం చేసిన మొదటి సినిమాలో నటించి ఆరేళ్లు పూర్తి అయినట్టు పేర్కొన్నారు. కీర్తీ సురేష్‌ ఈ ఏడాది నాగార్జున ‘మన్మథుడు-2’లో అతిధి పాత్రలో నటించారు. కాగా, 2020లో తెలుగు, తమిళ, హింది, మలయాళం సినిమాల్లో నటించనుంది. ప్రస్తుతం కీర్తీ నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో తెరకెక్కె ‘గుడ్‌ లక్‌ సఖీ’ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ షూటర్‌ పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement