ఆ హీరోయిన్ కి మళ్లీ పెళ్లి ఆలోచన | Kavya Madhavan Love Marriage No Arranged Second | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ కి మళ్లీ పెళ్లి ఆలోచన

Feb 19 2016 3:25 AM | Updated on Apr 3 2019 9:11 PM

ఆ హీరోయిన్ కి మళ్లీ పెళ్లి ఆలోచన - Sakshi

ఆ హీరోయిన్ కి మళ్లీ పెళ్లి ఆలోచన

ప్రేమించి పెళ్లాడతానంటోంది నటి కావ్యామాధవన్. తమిళంలో కాశీ, ఎన్ మన వాళిల్, సాధుమిరండా చిత్రాల్లో నటించిన...

ప్రేమించి పెళ్లాడతానంటోంది నటి కావ్యామాధవన్. తమిళంలో కాశీ, ఎన్ మన వాళిల్, సాధుమిరండా చిత్రాల్లో నటించిన ఈ మలయాళ భామ మాతృభాషలో నంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. అప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. కువైట్‌కు చెందిన నిషాల్ చంద్ర అనే వ్యక్తిని మనువాడిన కావ్యామాధవన్ కొంత కాలం ఆయనతో కలిసి కాపురం చేసి ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయి విడాకులు కూడా పొందింది. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఈ అమ్మడు రీఎంట్రీలోనూ సక్సెస్‌ఫుల్ నాయకిగా రాణిస్తోంది.
 
ఈ బ్యూటీ మళ్లీ పెళ్లికి సిద్ధమైందనే ప్రచారం జోరందుకుంది. దీని గురించి కావ్యామాధవన్ స్పందిస్తూ ప్రస్తుతం తాను సినిమా, రచన, వ్యాపారం అం టూ చాలా బిజీగా ఉన్నానంది. అయితే ఇది మాత్రమే జీవితం కాదన్న విషయం తనకు తెలుసంది. తన తల్లిదండ్రులకూ వయసు మీదపడుతోందని, తనకు తోడంటూ ఒకరు అవసరమేనని అంది.
 
అందుకే మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని పేర్కొంది.అయితే ఈ సారి కచ్చితంగా ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోనంది.తనకు తెలియని,పరిచయం లేని తనను ఒక నటిగానే చూసే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో అర్థమే లేదంది.తనతో స్నేహంగా మెలిగి ప్రేమించే అతన్ని మాత్రమే ఈ సారి మనువాడాలనుకుంటున్నానని తెలిపింది. సహ నటుడు దిలీప్‌తో ప్రేమకలాపాలు అంటూ సాగుతున్న ప్రచారం గురించి అడగ్గా ఇప్పటికే ఈ విషయం గురించి చాలా సార్లు వివరణ ఇచ్చాను దిలీప్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని కావ్యామాధవన్ స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement