కరీనా.. స్వీట్ 15 | Kareena .. Sweet 15 | Sakshi
Sakshi News home page

కరీనా.. స్వీట్ 15

Jun 27 2015 11:55 PM | Updated on Sep 3 2017 4:28 AM

కరీనా.. స్వీట్ 15

కరీనా.. స్వీట్ 15

కథానాయికల కెరీర్ ఏడెనిమిదేళ్లకు మించి సాగదనే అభిప్రాయన్ని కరీనా కపూర్ వంటి తారలు అబద్ధం చేస్తున్నారు. ఈ బ్యూటీ కథానాయిక అయ్యి దాదాపు పదిహేనేళ్లయ్యింది.

కథానాయికల కెరీర్ ఏడెనిమిదేళ్లకు మించి సాగదనే అభిప్రాయన్ని కరీనా కపూర్ వంటి తారలు అబద్ధం చేస్తున్నారు. ఈ బ్యూటీ కథానాయిక అయ్యి దాదాపు పదిహేనేళ్లయ్యింది. థర్టీ ప్లస్‌లో ఉన్న కరీనాకు కుర్ర తారల నుంచి బలమైన పోటీయే ఉంది. కానీ, నేను పోటీలో లేనంటున్నారామె. ‘‘కథానాయికగా సెక్యూర్డ్ ప్లేస్‌లో ఉన్నాను.
 
 ఆ స్థానం ఇంకొకరి సొంతం అయ్యే అవకాశం లేదు’’ అని కూడా అన్నారు. హిందీ రంగంలో తిరుగులేని తార అనిపించుకున్నారు కదా.. మరి, హాలీవుడ్‌కి వెళ్లాలనే టార్గెట్ ఏమైనా ఉందా? అనే ప్రశ్న కరీనా ముందుంచితే - ‘‘హాలీవుడ్ చిత్రాలు చేయాలంటే ముంబయ్ నుంచి మకాం ఎత్తేయాలి.
 
 లాస్ ఏంజిల్స్‌లో ఉండాల్సి వస్తుంది. మా వాళ్లను వదిలేసి అక్కడికెళ్లడం నాకిష్టం లేదు. ఇక్కడ నేను సీనియర్ హీరోయిన్‌ని. అక్కడికెళ్లి జూనియర్ అనిపించుకోవడం అవసరమా? ఏదో రోజు స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్‌ని మన భారతీయ పరిశ్రమ అధిగమిస్తుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement