మాస్‌ నాయక | 'Jaya Janaki Nayaka' is going to be released on August 11th | Sakshi
Sakshi News home page

మాస్‌ నాయక

Jul 8 2017 11:30 PM | Updated on Aug 3 2019 12:45 PM

మాస్‌ నాయక - Sakshi

మాస్‌ నాయక

మాస్‌... మ... మ... మాస్‌! బోయపాటి హీరో మాస్‌ లుక్‌ బయటకొచ్చేసింది.

మాస్‌... మ... మ... మాస్‌! బోయపాటి హీరో మాస్‌ లుక్‌ బయటకొచ్చేసింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్లు. జస్ట్‌... కొన్ని రోజుల క్రితం ఈ సిన్మాలో హీరో హీరోయిన్ల (శ్రీనివాస్, రకుల్‌) ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

బ్యూటిఫుల్‌ అండ్‌ కూల్‌ అనేలా ఉందది. లేటెస్ట్‌గా బోయపాటి మార్క్‌ మాస్‌ స్టిల్‌ విడుదల చేశారు. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నట్లు దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కళ: సాహి సురేశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: రిషి పంజాబి, ఫైట్స్‌: రామ్‌–లక్ష్మణ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement