IT Raids on Ramanaidu Studios and Other Suresh Productions Offices | రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు - Sakshi
Sakshi News home page

రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు

Nov 20 2019 9:42 AM | Updated on Nov 20 2019 11:28 AM

Income Tax Raids in Rama Naidu Studio - Sakshi

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు.

సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.

కాగా, గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో‌ భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement