నేను గర్భం దాల్చానా? | Ileana Said Iam Not Pregnent Its something I have always wanted | Sakshi
Sakshi News home page

ఇలియానా ఆగ్రహం

Jun 18 2018 8:13 AM | Updated on Jun 18 2018 11:29 AM

Ileana Said Iam Not Pregnent Its something I have always wanted - Sakshi

తమిళసినిమా: నేను గర్భం దాల్చానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నటి ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ జాణ ఆ తరువాత కోలీవుడ్‌ అవకాశాలను కాదనుకని బాలీవుడ్‌లో రాణించాలన్న ఆకాంక్షతో అక్కడ మకాం పెట్టింది. అక్కడ ఒకటి రెండు అవకాశాలు అమ్మడిని వరించడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు కురిపించింది. ముఖ్యంగా దక్షిణాదిలో అదేం టేస్టో గానీ నా నడుమునే ఎక్కువ చూపించేవారని వెటకారపు వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యింది కూడా. అయితే అక్కడ బర్ఫీ, హిమ్మత్‌వాలా లాంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదిలోనే అవకాశాల వేట సాగించింది. అలా టాలీవుడ్‌లో తాజాగా ఒక అవకాశాన్ని పట్టేసింది. రవితేజకు జంటగా అమర్‌ అక్బర్‌ ఆంటోని అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది.

ఇది తమిళంలో విజయ్‌ నటించిన తెరి చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం. చేతిలో అవకాశాలు లేకపోయినా ఇలియానా వార్తల్లో నానుతూనే ఉంది. తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూతో చెటాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోలను సోషల్‌ మీడియాల్లో విడుదల చేస్తూ సంచలనం కలిగిస్తూనే ఉంది. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందని, గర్భం దాల్చిందనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ విషయాల గురించి నోరెత్తని ఇలియానా తాజాగా వివరణ ఇవ్వడం మంచిదనుకుందో ఏమో, తాను గర్భం దాల్చలేదనీ, ఇప్పుడే పిల్లల్ని కనే ఆలోచన లేదని చెప్పింది. తాను హీరోయిన్‌గా మరి కొంత కాలం నటించాలని కోరుకుంటున్నానని అంది. అంతేకానీ తనకు పెళ్లి కాలేదని మాత్రం చెప్పలేదు. సో తను బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న మాట నిజమేనని అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement