అతడితో మళ్లీ నటిస్తా: సోనమ్ | I will be working with Fawad again, says Sonam Kapoor | Sakshi
Sakshi News home page

అతడితో మళ్లీ నటిస్తా: సోనమ్

Sep 29 2014 4:40 PM | Updated on Sep 2 2017 2:07 PM

అతడితో మళ్లీ నటిస్తా: సోనమ్

అతడితో మళ్లీ నటిస్తా: సోనమ్

పాకిస్థాన్ నటుడు ఫవద్‌ఖాన్ తో మళ్లీ జత కడతానంటోంది బాలీవుడ్ తార సోనమ్ కపూర్.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నటుడు ఫవద్‌ఖాన్ తో మళ్లీ జత కడతానంటోంది బాలీవుడ్ తార సోనమ్ కపూర్. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఖూబ్‌సూరత్’ సినిమా సక్సెస్ బాటలో పయనిస్తోంది. 1980లో హృషికేష్ ముఖర్జీ ‘ఖూబ్‌సూరత్’ సినిమా తీశారు. ఇప్పుడు అదే టైటిల్‌తో విడుదలైన సినిమాలో సోనమ్, ఫవద్‌ఖాన్ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.

ఫవద్‌ఖాన్ తో వెంటనే నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని సోనమ్ పేర్కొంది. తెరపై తమ నటన, కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని తెలిపింది. తాము నటించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకర్షణగా నిలిచాయని అంది. తామిద్దం తప్పకుండా మళ్లీ కలిసి నటిస్తామని సోనమ్ స్పష్టం చేసింది. 'ఖూబ్‌సూరత్'కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వస్తోందని సంతోషంగా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement