నేను యావరేజ్‌.. అయితే ఏంటి?

i am average so what?-Taapsee Pannu - Sakshi

‘‘నువ్వు చాలా యావరేజ్‌గా ఉంటావ్‌? నిన్ను హీరోయిన్‌ను చేసింది ఎవరు?’’.. ఇదిగో ఇలాగే కొంచెం రూడ్‌గా ఓ నెటిజన్‌ హీరోయిన్‌ తాప్సీని క్వొశ్చన్‌ చేశాడు. తాప్సీ సైలెంట్‌గా ఉండలేదు. తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ‘‘నాలో ఉన్న చిన్ని చిన్ని యాక్టింగ్‌ స్కిల్సే నన్ను హీరోయిన్‌ అయ్యేలా చేశాయి. అయినా యావరేజ్‌గా కనిపించడం అంత ప్రాబ్లమ్‌ ఏమీ కాదు. ప్రపంచంలో మీరు చెప్పిన నాలాంటి వాళ్లే ఎక్కువమంది ఉన్నారు’’ అని పేర్కొన్నారు తాప్సీ. అయితే.. తాప్సీ రెస్పాండ్‌ అయిన కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను ఆ నెటిజన్‌ తొలగించడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ ఏడాది మరో సినిమా షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు తాప్సీ.

అనురాగ్‌ కశ్యప్‌ దర్వకత్వంలో అభిషేక్‌ బచ్చన్, విక్కీ కుశాల్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన ‘మన్‌మర్జియాన్‌’ షూటింగ్‌ జమ్ము కశ్మీర్‌లో కంప్లీట్‌ అయ్యింది. ఫైనల్‌ డే షూట్‌లో తాప్పీ, అభిషేక్‌ బచ్చన్‌ పాల్గొన్నారు. ఈ సినిమాతో తాప్సీ ఈ ఏడాది కంప్లీట్‌ చేసిన సినిమాల సంఖ్య నాలుగుకు చేరింది. తడ్కా, సూర్మ, ముల్క్‌ సినిమాల షూటింగ్‌ను తాప్సీ ఇటీవలే కంప్లీట్‌ చేశారు. హిందీ సినిమాల్లో నటించడంతో పాటు ఓ తెలుగు సినిమా కూడా చేస్తున్నారు తాప్సీ. హరి దర్శకత్వంలో ఆది పినిశెట్టి, రితాకా సింగ్, తాప్సీ ముఖ్య తారలుగా తెలుగులో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top