సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది | Hippi Teaser Launch By Nani | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

Mar 22 2019 2:41 AM | Updated on Mar 22 2019 5:00 AM

Hippi Teaser Launch By Nani - Sakshi

కార్తికేయ, నాని, టీఎన్‌ కృష్ణ, విక్రమ్‌ కె కుమార్‌

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్లాక్‌బాస్టర్‌ అయింది. కార్తికేయ బాగా నటించాడని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు కార్తికేయతో ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా చేస్తున్నాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఎందుకు అంత హిట్‌ అయిందో ఇప్పుడు అర్థం అయింది’’ అని నాని అన్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి యస్‌. థాను నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో టీఎన్‌ కృష్ణ  దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిప్పీ’. కార్తికేయ, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లు. ‘హిప్పీ’ టీజర్‌ను నాని విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కార్తికేయతో పని చేయడం సరదాగా ఉంది. ఆ పరిచయంతోనే నేను ఈ టీజర్‌ రిలీజ్‌ చేశాను. సక్సెస్‌ఫుల్‌ సినిమాకు కావాల్సిన అన్ని లక్షణాలు, వైబ్రేషన్స్‌ ఈ టీజర్‌లో ఉన్నాయి.

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘రెండు పాటల మినహా షూటింగ్‌ పూర్తయింది. అందరి అంచనాలకు తగ్గ రీతిలో నిర్మిస్తున్నాం. సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు థాను. ‘‘టీజర్‌ రిలీజ్‌ చేసినందుకు నానిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు టీఎన్‌ కృష్ణ. ‘‘నానిగారితో పని చేసే అవకాశం ‘గ్యాంగ్‌లీడర్‌’ ద్వారా వచ్చింది. అడగ్గానే టీజర్‌ లాంచ్‌ చేసిన ఆయనకు థ్యాంక్స్‌. షూటింగ్‌ చేస్తూ నానిగారికి బాగా క్లోజ్‌ అయ్యాను’’ అన్నారు కార్తికేయ. ‘‘ట్రైలర్‌ చూస్తుంటే ఫన్‌ రైడ్‌లా ఉంది. కార్తికేయకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: నివాస్‌ కె ప్రసన్న, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement