ఆ కథకు మహేష్‌, విజయ్‌, యష్‌..!

The Highway Mafia Story Suits For Mahesh Babu Vijay And Yash - Sakshi

ఇప్పుడు సౌత్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న హీరో యష్‌. సాండల్‌వుడ్‌కు ఇంతవరకు సాధ్యంకాని ఫీట్‌ను కె.జి.యఫ్‌తో సాధించి.. రికార్డులు బ్రేక్‌ చేశాడు. ఇప్పటికీ ఈ సినిమా విజయవంతంగా రన్‌ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసి జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోంది. 

అయితే ఓ యువ రచయితి తాను రాసిన కథను తెలుగులో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, తమిళ్‌లో విజయ్‌, కన్నడలో యష్‌ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సుచిత్రా రావు అనే రచయిత్రి 2017లో రచించిన ‘ది హైవే మాఫియా’ కథను చిత్రంగా రూపొందించాలని.. దీంట్లో విజయ్‌, మహేష్‌, యష్‌లు నటిస్తే.. బాగుంటుందని అన్నారు. పశువుల అక్రమ రవాణా నేపథ్యంలో ‘ది హైవే మాఫియా’  కథ సాగుతుంది. మరి ఇప్పటికే బిజీగా ఉన్న ఈ స్టార్‌ హీరోలు ఈ కథకు ఓకే చెప్తారో లేదో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top