ప్రముఖ హీరో మాజీ భార్యపై ఛీటింగ్ కేసు | Goa: Designer Sussanne Khan booked for allegedly cheating real estate firm | Sakshi
Sakshi News home page

ప్రముఖ హీరో మాజీ భార్యపై ఛీటింగ్ కేసు

Jun 19 2016 3:04 PM | Updated on Aug 21 2019 10:13 AM

ప్రముఖ హీరో మాజీ భార్యపై ఛీటింగ్ కేసు - Sakshi

ప్రముఖ హీరో మాజీ భార్యపై ఛీటింగ్ కేసు

బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్పై గోవాలో చీటింగ్ కేసు నమోదైంది.

గోవా: బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్పై గోవాలో చీటింగ్ కేసు నమోదైంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆమెపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఆర్కిటెక్ట్గా పరిచయం చేసుకున్న సుసానే ఖాన్ తమ నుంచి ఓ కాంట్రాక్టు తీసుకుందని, ఈ పనికోసం 2013లో ఆమెకు 1.87 కోట్ల రూపాయలు చెల్లించామని, అయితే ఇప్పటివరకు పని పూర్తిచేయలేదని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సుసానేను కోరగా, ఆమె తెలియజేయలేదని ఆరోపించింది.  కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఆరా తీయగా సుసానే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిసిందని ఈ సంస్థ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement