చేయి పట్టుకొని లాగింది: వైరల్‌ వీడియో

Female Fan pulls Salman Khan Hand - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు భారీగా అభిమానగణం ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ మహిళా ఫ్యాన్స్‌ కూడా ఆయనకు ఎక్కువే. ఆయన బయట ఎక్కడ కనిపించినా.. ఆయన చుట్టూ గుమిగూడి సెల్ఫీలు, ఫోటోల కోసం వాళ్లు ఎగబడటం తెలిసిందే.

ఇటీవల సల్మాన్‌కు ఇదేరకమైన అనుభవం ఎదురైంది. ఆల్‌టైమ్‌ ఫెవరేట్‌ మూవీ అయిన ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఇటీవల ముంబైలోని లిబర్టీ థియేటర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటుచేశారు. చిత్ర బృందం ఏర్పాటుచేసిన ఈ షోకు సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన సల్మాన్‌, మాధురీ దీక్షిత్‌తోపటు పలువురు నటులు, చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ షో సందర్భంగా థియేటర్‌ వద్ద సల్మాన్‌ అభిమానులు చుట్టుముట్టారు. ఇంతలో ఓ మహిళా అభిమాని ఆయనను చేయిపట్టి లాగింది. సల్వార్‌ సూట్‌ ధరించిన ఆమె.. సల్మాన్‌తో మాట్లాడుతూ.. ఆయన వెళ్లిపోతుండటంతో చేయిపట్టి తనవైపు లాగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకొని ఆమెను పక్కకుతప్పించారు. ఈ అనూహ్య ఘటనతో సల్మాన్‌ ఒకింత అసహనంగా కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top