న్యూ ఇయర్‌.. న్యూ మూవీ... | English Vinglish likely to return with a sequel, Sridevi sends out a cryptic message | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌.. న్యూ మూవీ...

Nov 23 2017 12:58 AM | Updated on Nov 23 2017 12:58 AM

English Vinglish likely to return with a sequel, Sridevi sends out a cryptic message - Sakshi

పరాయి దేశంలో అక్కడి భాష సరిగా రాకపోతే ఇక్కట్లు తప్పవు. లోకల్‌ లాంగ్వేజ్‌ వచ్చినవారు ఎవరైనా తోడుంటే పర్లేదు. కానీ, ఒంటరి ప్రయాణం చేస్తే మాత్రం కమ్యూనికేషన్‌ ప్రాబ్లమ్స్‌ను ఫేస్‌ చేయక తప్పదు. అయితే అక్కడే లైఫ్‌ లీడ్‌ చేయాలనుకున్నప్పుడు భాష నేర్చుకోవడంలో తప్పు లేదు. అందుకు వయసుతో సంబంధంలేదు. తక్కువ టైమ్‌లోనే భాష నేర్చుకుని అక్కడి లోకల్‌ పీపుల్స్‌కు దీటుగా మాట్లాడగలిగితే గ్రేట్‌. రీల్‌ లైఫ్‌లో శ్రీదేవి ఇదే పని చేసి, ప్రేక్షకుల చేత గ్రేట్‌ అనిపించుకున్నారు.

పైన చెప్పిన లైన్స్‌ను చదువుతున్నప్పుడు ఆమె నటించిన ‘ఇంగ్లీష్‌..వింగ్లీష్‌’ సినిమాలోని కొన్ని సీన్స్‌ సినిమా చూసినవారికి గుర్తొచ్చి ఉండొచ్చు. ఐదేళ్లక్రితం దర్శకురాలు గౌరీ షిండే రూపొందించిన ఈ సినిమాతోనే శ్రీదేవి సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ఇంగ్లీష్‌–వింగ్లీష్‌’ సినిమాకు సీక్వెల్‌ రూపొందించనున్నారట గౌరీ షిండే. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారన్నది బాలీవుడ్‌ సమాచారమ్‌.

అంటే శ్రీదేవి కొత్త సంవత్సరంలో సరికొత్తగా న్యూ మూవీ స్టార్ట్‌ చేయబోతున్నారన్నమాట. అసలు.. 2014లోనే శ్రీదేవి–గౌరీ షిండే కాంబినేషన్‌లో ఓ థ్రిల్లింగ్‌ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం తెరకెక్కనుందని వార్తలొచ్చాయి. అయితే ఆ స్క్రిప్ట్‌ వర్కౌట్‌ కాలేదని, అందుకే ‘ఇంగ్లీష్‌..వింగ్లీష్‌’ సీక్వెల్‌ను తెరకెక్కించాలని భావిస్తున్నారన్నది బాలీవుడ్‌ టాక్‌. అంతా ఓకే అయితే ఐదేళ్ల తర్వాత హిట్‌ కాంబినేషన్‌లో ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మరో హిట్‌ మూవీ చూడొచ్చని బాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement