అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ | Dhanush Vada Chennai Trailer Launch On Hes Birth Day | Sakshi
Sakshi News home page

అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌

Jun 16 2018 8:48 AM | Updated on Jun 16 2018 8:48 AM

Dhanush Vada Chennai Trailer Launch On Hes Birth Day - Sakshi

తమిళసినిమా: నటుల పుట్టిన రోజులు, వారి చిత్రాల వేడుకలు అభిమానులకు బహుమతులుగా మారిపోయాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ధనుష్‌ అభిమానులకు వచ్చే నెల రెండు బహుమతులు అందించనున్నారు. అందులో ఒకటి ఆయన పుట్టిన రోజు జూలై 28 కాగా, మరొకటి ధనుష్‌ నటించిన వడచెన్నై చిత్ర తొలి భాగం ట్రైలర్‌ విడుదల. అవును ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ, తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వడచెన్నై. విచారణై చిత్రం తరువాత వెట్ట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఎట్టకేలకు వడచెన్నై తొలి భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ధనుష్‌తో పాటు నటి ఆండ్రియా, ఐశ్వర్యరాజేశ్, సముద్రఖని, ఆమిర్, డేనియల్‌ బాలాజీ, కిశోర్, కరుణాస్, పవన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. చెన్నై నేపధ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్‌ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో ధనుష్‌ అన్బు అనే పాత్రలో విభిన్న గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను లైకా సంస్థ కొనుగోలు చేయడం విశేషం. రజనీకాంత్‌ నటించిన కాలా చిత్ర విడుదల హక్కులను లైకా సంస్థనే పొందింది. వడచెన్నై చిత్ర ట్రైలర్‌ను నటుడు ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న, చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇది ధనుష్‌ అభిమానులకు పండగ చేసుకునే విషయమే అవుతుంది. ధనుష్, దర్శకుడు వెట్ట్రిమారన్‌ కాంబినేషన్‌లో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు రావడంతో ప్రస్తుతం వడచెన్నై చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement