ఇది అత్యంత అరుదైన గౌరవం: దీపికా పదుకొనే | Deepika padukone Wins Cristal Award For Spreading Mental Health Awareness | Sakshi
Sakshi News home page

క్రిస్టల్‌ ఆవార్డు గెలుచుకున్న దీపికా!

Dec 14 2019 3:59 PM | Updated on Dec 14 2019 7:27 PM

Deepika padukone Wins Cristal Award For Spreading Mental Health Awareness - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే బాలీవుడ్‌లో వరుస విజయాలతో  దూసుకుపోతున్నారు. హిస్టారికల్‌ చిత్రాలలో నటిస్తూ బి టౌన్‌లో తనకుంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ బ్యూటీ క్వీన్‌. ఇటివలె దీపిక  నటించిన ‘పద్మావతి’ సినిమాకు ఉత్తమ నటిగా ఆవార్డును కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. నటిగా ఎన్నో ఆవార్డులను కైవసం చేసుకుంటున్న దీపికాకు మరో ఆరుదైన గౌరవం దక్కింది.  2020లో వరల్డ్‌ ఎకనమిక్‌ సమ్మిట్‌ నిర్వహించే 26వ వార్షిక ‘క్రిస్టల్‌ ఆవార్డు’కు దీపికా ఎంపికయ్యారు. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగహన కల్పించినందుకు గాను ‘క్రిస్టల్‌ ఆవార్డు’ను గెలుచుకున్నారు. దీనిపై దీపిక మాట్లాడుతూ.. వార్షిక క్రిస్టల్‌ ఆవార్డును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఆవార్డుకు ఎన్నికవ్వడం అత్యంత గౌరవంగా భావిస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిలకు లోనవుతూ అనారోగ్యబారిన పడుతున్న లక్షలాది మందికి ఈ ఆవార్డు అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.


ఇక దీపిక 2015లో స్థాపించి ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ (టీఎల్‌ఎల్‌ఎల్‌ఎఫ్‌)’ ద్వారా మానసిక అనారోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడమే కాకుండా డి-స్టిగ్మాటైజేషన్‌పై ప్రచారాలను కూడా నిర్వహిస్తుంటారు. అలాగే ఈ ఫౌండేషన్‌ ద్వారా మానసిక ఆనారోగ్య రుగ్మతలపై ఆవగాహన కల్పిస్తూ.. మానసిక ఆరోగ్యంపై శిక్షణా తరగతులను, పరశోధనలను, ప్రముఖలచే ఉపన్యాసాలు, భోధనలను కూడా ఇప్పిస్తుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement