ఆ ఇద్దరి గురించి అడగొద్దు! | Deepika Padukone finds comparison between Ranbir Kapoor and Ranveer Singh 'silly' | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి గురించి అడగొద్దు!

Dec 28 2015 1:39 AM | Updated on Sep 3 2017 2:40 PM

ఆ ఇద్దరి గురించి అడగొద్దు!

ఆ ఇద్దరి గురించి అడగొద్దు!

ఈ మధ్య దీపికా పదుకొనే ఏ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందరూ కామన్‌గా అడుగుతున్న ప్రశ్న ఒకటే.

ఈ మధ్య దీపికా పదుకొనే ఏ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందరూ కామన్‌గా అడుగుతున్న ప్రశ్న ఒకటే. ‘రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌తో మీరు నటించారు కదా.. ఇద్దరి మధ్య ఉన్న తేడా గురించి చెప్పండి’ అన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్న వింటే నాకు నవ్వొచ్చేస్తోందని దీపికా పదుకొనే చెబుతూ - ‘‘కెరీర్ మొదలుపెట్టాక నేను ఎంతోమంది హీరోల పక్కన యాక్ట్ చేశాను. వాళ్లందరి గురించి అడగకుండా రణ్‌బీర్, రణ్‌వీర్ గురించి మాత్రం అడుగుతుంటారు.
 
  ఆ ప్రశ్న విన్నప్పుడు నాకు భలే కామెడీగా ఉంటుంది. నా మొదటి సినిమాకే నేను షారుక్ ఖాన్‌తో జతకట్టాను. ఆయన గురించి అడగొచ్చుగా. అలాగే, సైఫ్ అలీఖాన్ సరసన నటించాను. ఇంకా చాలామందితో యాక్ట్ చేశాను. కానీ, అందర్నీ వదిలేసి రణ్‌వీర్, రణ్‌బీర్ గురించి నేనేదైనా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. అసలు వాళ్లను నేనెందుకు పోల్చాలి? నటులుగా ఇద్దరిదీ భిన్నమైన శైలి. అది అందరికీ తెలిసిందే. అందుకే ఇద్దరి గురించీ నా దగ్గర అడగొద్దు. అడిగినా నా నుంచి సంచలనాత్మక వ్యాఖ్యలేవీ రావు’’ అని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement