అర్రె..ర్రె...రణ్‌బీర్ అన్నయ్యా! | Deepika Padukone and Ranbir Kapoor in Tamasha's trailer | Sakshi
Sakshi News home page

అర్రె..ర్రె...రణ్‌బీర్ అన్నయ్యా!

Sep 22 2015 11:53 PM | Updated on Sep 3 2017 9:47 AM

అర్రె..ర్రె...రణ్‌బీర్ అన్నయ్యా!

అర్రె..ర్రె...రణ్‌బీర్ అన్నయ్యా!

ఎంతలా బ్రేకప్ అయినా ప్రేమించిన వాళ్లను బ్రదర్...సిస్టర్...అని ఎవరూ అనరు.

ఎంతలా బ్రేకప్ అయినా ప్రేమించిన వాళ్లను బ్రదర్...సిస్టర్...అని ఎవరూ అనరు. కానీ దీపికా పదుకొనే మాత్రం రణ్‌బీర్ కపూర్‌ని పట్టుకుని ‘బ్రదర్’ అనేశారు. ఇదెప్పుడా అని అనుకుంటున్నారా? ఈ సన్నివేశం ‘తమాషా’ ట్రైలర్ విడుదల వేడుకలో జరిగింది. విషయంలోకి వెళితే... వాట్సప్, ఫేస్‌బుక్‌లలో సందేశాలు 90 రోజుల పాటు తీసేయడానికి లేదనే వార్తలు వచ్చాయి. దీని గురించి రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ- ‘‘మీకు గనక బాయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ ఉంటే గనక అభ్యంతరకరమైన సందేశాలు మాత్రం పంపుకోవద్దు.

బుక్ అయిపోతారు’’ అని చెప్పారు. పక్కనే దీపికా పదుకొనే వెంటనే అతను చెప్పిన సమాధానానికి ఇంప్రెస్ అయిపోయి,‘‘ ‘శభాష్ బ్రొ’(బ్రదర్)’’ అని రణ్‌బీర్ భుజం తట్టారు. ఆ మాటతో రణబీర్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.అక్కడున్న మీడియా కూడా అవాక్కయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement