నాన్నగారి బయోపిక్‌ ఆలోచన లేదు

d suresh babu interview about Ee Nagaraniki Emaindi - Sakshi

‘‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌ తర్వాత తరుణ్‌ భాస్కర్‌కి పెద్ద స్టార్‌తో సినిమా చేసే చాన్స్‌  వచ్చినా తగ్గాడు. తనకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడా ప్రాసెస్‌లో ఉన్నాడు. ఓ రోజు తప్పకుండా హైట్స్‌కి రీచ్‌ అవుతాడు. అది గ్యారంటీ’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. విశ్వక్‌ సేన్, సాయి సుశాంత్, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమతం, అనీషా ఆంబ్రోస్,  సిమ్రాన్‌ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో ఆయన నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ నెల 29న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు...

► మా బ్యానర్‌లో చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా 2 పాయింట్స్‌ ఉంటాయి. కొత్తవారిని, కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేయడం, ఫిల్మ్‌ మేకింగ్‌ ప్రాసెస్‌ని ఇంకా బెటర్‌ చేయడం. ఇస్రో లాంటి చాలా సంస్థలు పనిని క్రమశిక్షణతో ఒక ప్రాసెస్‌లో చేస్తాయి కాబట్టే వరల్డ్‌ క్లాస్‌ సక్సెస్‌ని అచీవ్‌ చేస్తున్నాయి. అదే రివల్యూషన్, అంత క్రమశిక్షణ ఫిల్మ్‌ మేకింగ్‌లోనూ రావాలి. దీన్ని ఆచరణలో పెట్టడం కష్టమేం కాదు. కచ్చితంగా చేరుకుంటాం.

► మనం సినిమా చూడ్డానికి వెళ్లి కూర్చోగానే లైట్స్‌ ఆఫ్‌ చేసి, స్క్రీన్‌పై ఏదో ప్లే చేస్తారు. ఆ వీడియోకి మనం కనెక్ట్‌ అయితే సినిమా హిట్‌.. లేకపోతే ఫ్లాప్‌.. సింపుల్‌ ఫార్ములా. సింక్‌ సౌండ్‌  ప్రాసెస్‌లోనే ఫిల్మ్‌ మేకింగ్‌ జరగాలి. ఈ రోజుల్లో యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ దానికే ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు.

► ‘ఈ నగరానికి ఏమైంది’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు రెండుసార్లు సెట్స్‌కి వెళ్లాను. ప్రతీదీ పర్ఫెక్ట్‌గా అనిపించింది. నాన్నగారి (రామానాయుడు) బయోపిక్‌ రిస్క్‌. ‘మహానటి, సంజు’ లాంటి బయోపిక్స్‌ వేరు, వాళ్లు ఒకే లైఫ్‌లో మల్టిపుల్‌ లైవ్స్‌ బతికారు. నాన్నగారి లైఫ్‌ అలా కాదు. నిజానికి ఒక స్టోరీలో కాంట్రవర్సీస్‌ లేకపోతే ఆ స్టోరీ ఎవరూ వినరు.. చూడరు. ప్రస్తుతానికి నాన్నగారి బయోపిక్‌ ఆలోచన లేదు.

► సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఏ సినిమా నిర్మించినా పార్టనర్స్‌ని కలుపుకోవడానికే ఇష్టపడతాను. మా ప్రొడక్షన్‌లో బాబీ డైరెక్షన్‌లో వెంకటేశ్, చైతన్య సినిమా ఉంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో ప్రాసెస్‌ ఉంటుంది. రాజమౌళి ‘బాహుబలి’కి ఐదేళ్లు పట్టింది. మా బ్యానర్‌లో గుణశేఖర్‌ డైరెక్షన్‌లో ‘హిరణ్యకశ్యప’కు చాలా రోజులుగా వర్క్‌ జరుగుతోంది. ఏదైనా పర్ఫెక్ట్‌గా అయ్యాకే సెట్స్‌పైకి వస్తుంది. మేకింగ్‌ కూడా అంతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top