
ఆ ఇద్దరి సహకారంతోనే సినిమాల్లోకి వచ్చా!
చిన్నప్పటి నుంచి నాకు చదువు అబ్బలేదు.. దీంతో సినీరంగంలోకి అడుగుపెట్టానని సినిమాటోగ్రఫీ చోటా కెనాయుడు అన్నారు.
మాతృదేవోభవతో మంచి గుర్తింపు
ఇప్పటి వరకు 70 సినిమాలకు పని చేశా..
సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు
మిర్యాలగూడ : చిన్నప్పటి నుంచి నాకు చదువు అబ్బలేదు.. దీంతో సినీరంగంలోకి అడుగుపెట్టానని సినిమాటోగ్రఫీ చోటా కెనాయుడు అన్నారు. శనివారం మిర్యాలగూడలో పింక్స్ ఎన్ బ్లూస్ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరం తర్వాత చదువులో రాణించలేకపోవడంతో తండ్రి కామారెడ్డి చిట్టిబాబునాయుడి సహకారంతో ఫొటో అసిస్టెంట్‌గా సినిమాల్లో పని చేసినట్లు తెలిపారు. కొంత కాలంపాటు కేఎస్ వద్ద పని చేసి టీవీ సీరియల్స్‌కు కెమెరామెన్‌గా పని చేసినట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత దాసరి నారాయణరావు, చిరంజీవిల సహకారంతో సినిమాలకు కెమెరామెన్‌గా వెళ్లి సినిమాటోగ్రఫీలో రాణిస్తున్నట్లు చెప్పారు. మొట్టమొదటి సినిమా మాతృదేవోభవతో మంచి గుర్తింపు వచ్చిందని ఆ తర్వాత సూరిగాడు, అమ్మ రాజీనామా, వారసుడు, మాస్టర్, డాడీ, చూడాలని ఉంది. అంజి, కొత్త బంగారులోకం, అదుర్స్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసినట్లు వివరించారు.
1979 నుంచి ఇప్పటి వరకు 70 సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశానన్నారు. తన తండ్రి చిట్టిబాబునాయుడు కూడా కథలు రాయడంతో పాటు డ్రామా ఆర్టిస్టుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల సాయిధరమ్‌తేజ్‌తో ఒక సినిమా, బెక్కం రాంమ్మోహన్ నిర్మాతగా మరో సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.