అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

Bollywood Pays Tribute To Pulwama Martyrs - Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్‌ తారలు సిద్దమయ్యారు. అందుకోసం వారంతా ఓ వీడియో సాంగ్‌లో కనిపించనున్నారు. ‘తూ దేశ్‌ మేరా’ అని సాగే ఈ పాటలో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణబీర్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు కనిపించనున్నారు. ఎంతో బిజీగా ఉండే తారలు.. అమర జవాన్లకు నివాళులర్పించడానికి తమ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది.

73వ స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్క రోజు ముందుగా ఈ వీడియో సాంగ్‌కు సంబంధించి కవర్‌ పోస్టర్‌ను సీఆర్పీఎఫ్‌ ట్విటర్‌ ద్వారా  విడుదల చేసింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న బాలీవుడ్‌ తారలకు ధన్యవాదాలు తెలిపింది. సీఆర్పీఎఫ్‌ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో బాలీవుడ్‌ తారలు జవాన్లకు సెల్యూట్‌ చేస్తూ కనిపించారు. ఈ పాట కోసం సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నౌటియల్, షబాబ్ సబ్రి, కబీర్ సింగ్‌లు తమ గళం విప్పారు. మీట్ బ్రోస్ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top