పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కౌశల్‌

Bigg Boss 2 Winner Kaushal Manda Key Role In Aadi Movie - Sakshi

‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2’తో కౌశల్‌ మందకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తన అటిట్యూడ్‌, గేమ్‌ ప్లానింగ్‌, ఇమేజ్‌తో ఆ సీజన్‌ మొత్తం రఫ్పాడించాడు. ఇక విజేతగా కౌశల్‌ పేరును ప్రకటించిన తర్వాత ఆయన అభిమానులు చేసిన కార్యక్రమాలు, కౌశల్‌ ఆర్మీ పేరిట చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నంత సేపు కౌశల్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. బోయపాటి శ్రీను, సుకుమార్‌ వంటి స్టార్‌ దర్శకుల సినిమాల్లో కౌశల్‌కు సినిమా అవకాశం లభించినట్లు అనేక వార్తలు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. 

అయితే కౌశల్‌, అయన అభిమానులు ఊహించని విధంగా సీన్‌ రివర్సయింది. టాలీవుడ్‌లో ఎక్కడా కూడా అతడి ఊసే లేదు. దీంతో తన యాడ్‌ ఏజెన్సీకే పరిమితమయ్యాడు‌. అయితే చాలా కాలం తర్వాత కౌశల్‌కు ఒక సినిమా అవకాశం లభించింది. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కౌశల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్ర చాలా కీలకమైందిని తెలుస్తోంది. జీబీ క్రిష్ణ దర్వకత్వం వహిస్తున్న ఆది 16వ చిత్రంలో కౌశల్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం కౌశల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, కెరీర్‌కు మరింత హెల్ప్ అవుతుందని కౌశల్‌తో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కౌశల్‌ నుంచి గాని చిత్రబృందం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కౌశల్‌కు సినిమా అవకాశం వార్త నిజమా కాదా అని తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి.

 

చదవండి:
సల్మాన్‌ పేరుతో మోసం!
బాలయ్య కోసం భారీగా శత్రు గణం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top