అభిమానుల సలహాలు కోరిన మెగాస్టార్ | Big B asks fans to send ideas to promote 'TE3N' | Sakshi
Sakshi News home page

అభిమానుల సలహాలు కోరిన మెగాస్టార్

May 10 2016 2:04 PM | Updated on Sep 3 2017 11:48 PM

అభిమానుల సలహాలు కోరిన మెగాస్టార్

అభిమానుల సలహాలు కోరిన మెగాస్టార్

సోషల్ మీడియాలో అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ, తన ఆలోచనలను పంచుకునే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సారి అభిమానుల నుంచి సలహాలను కోరాడు.

ముంబై: సోషల్ మీడియాలో అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ, తన ఆలోచనలను పంచుకునే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సారి అభిమానుల నుంచి సలహాలను కోరాడు. అమితాబ్ తాజా సినిమా 'టీఈ3ఎన్' ప్రమోషన్ కోసం సలహాలు పంపాలని అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. 'సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో సలహాలు పంపండి. పోస్టర్ డిజైన్ నుంచి పబ్లిసిటీ వరకు ఎలా చేయాలో సలహాలు ఇవ్వండి' అంటూ బిగ్ బీ ట్విట్టర్లో కోరాడు.

రిభు దాస్గుప్తా దర్శకత్వంలో సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ థ్రిల్లర్లో అమితాబ్తో పాటు విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. అమితాబ్ తాత పాత్రలో నటిస్తుండగా, విద్యా బాలన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement