టెక్నీషియన్ల సమ్మె.. షూటింగుల నిలిపివేత | Bengal cine technicians' overtime payment issue disrupts filming | Sakshi
Sakshi News home page

టెక్నీషియన్ల సమ్మె.. షూటింగుల నిలిపివేత

Jul 13 2016 8:27 PM | Updated on Sep 4 2017 4:47 AM

'ఓవర్ టైం పేమెంట్' విషయమై వివాదం చెలరేగడంతో పలు బెంగాలీ సీరియళ్ల షూటింగ్ నిలిపివేశారు. సినీ కార్మికుల ఫెడరేషన్కు, నిర్మాణ సంస్థలకు పేమెంట్ విషయమై జరిగిన వివాదంతో నిర్మాతలు షూటింగ్కు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు.

కోల్కతా : 'ఓవర్ టైం పేమెంట్' విషయమై వివాదం చెలరేగడంతో పలు బెంగాలీ సీరియళ్ల షూటింగ్ నిలిపివేశారు. సినీ కార్మికుల ఫెడరేషన్కు, నిర్మాణ సంస్థలకు పేమెంట్ విషయమై జరిగిన వివాదంతో నిర్మాతలు షూటింగ్కు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు.  

సినీ కార్మికుల ఫెడరేషన్ సెక్రటరీ అపర్ణ ఘటక్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ 10 గంటలకు మించి కొనసాగితే ప్రతి టెక్నీషియన్కు ఓవర్ టైం పేమెంట్ ఇవ్వాలి. కానీ చాలాకాలంగా ఓవర్ టైం చేసినా మాకు రావాల్సిన పేమెంట్ అందడం లేదు. దాంతో మాకు రావాల్సిన మొత్తం చెల్లించనిదే ఇకపై ఓవర్ టైం చేసేది లేదని నిర్మాతలకు స్పష్టం చేశాం. నిర్మాతలు షూటింగులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.. అయితే మేం వారి నిర్ణయాన్ని వ్యతిరేకించం' అని అన్నారు. దీంతో 8 నిర్మాణ సంస్థలకు చెందిన షూటింగ్లన్నీ మంగళవారం రాత్రి నుంచి ఆగిపోయాయి.

Advertisement
Advertisement