ఒళ్లు గగుర్పొడిచేలా అనుష్క వెబ్‌ టీజర్‌.. | Anushka Sharma Shares Her New Web Series Teaser | Sakshi
Sakshi News home page

అనుష్క శర్మ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ విడుదల

Apr 21 2020 6:42 PM | Updated on Apr 21 2020 8:05 PM

Anushka Sharma Shares Her New Web Series Teaser - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ డిజిటల్‌ ఫాంలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. క్రైం నేపథ్యంలో సాగే తన వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను అనుష్క మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘అన్ని మారుతాయి.. సమయం, ప్రజలు, సమాజం’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేస్తూ.. త్వరలో అమెజాన్‌ ప్రైంలో తన వెబ్‌సిరీస్‌ ప్రసారం అవుతుందని కూడా చెప్పారు.  (‘అనుష్క వదినా.. నన్ను సిఫార్సు చేయవా’)

స్క్రీన్‌పై రక్తం చిమ్ముతూ.. మొదలైన ఈ టీజర్‌.. భయంకరమైన వాయిస్‌తో స్కీన్‌పై సబ్‌టైటిల్స్‌ వస్తుంటాయి. ‘‘సమయం ఆసన్నమైంది. శాంతి భద్రతలను కొల్లగొట్టేందుకు చీడ పురుగుల్లాంటి మనుషులు భూమిపైకి వచ్చారు. వారు భూమిపై రక్తం చీమ్ముతూ బీభత్సం సృష్టిస్తారు. అంతేగాక ప్రపంచాన్ని సజీవ నరకంగా మారుస్తారు’’ అంటూ ఒళ్లు గగుర్పోడిచే భయానక శబ్ధంతో వినిపిస్తాయి. (జావేద్‌ ట్వీట్‌.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు!)

కాగా క్రైం, థిల్లర్‌ నేపథ్యంలో సాగే సిరీస్‌ను అనుష్క శర్మ క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను ఉడ్తా పంజాబ్‌, ఎన్‌హెచ్‌ 10 సినిమాల రచయిత రూపొందిస్తున్నారు. కాగా అనుష్క 2018లో నటించిన ‘జీరో’ సినిమా బీ-టౌన్‌ బాక్సాఫీస్‌ వద్ద బొల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనుష్క ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించలేదన్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement