పోరాటానికి సై | Akshay Kumar and Taapsee Pannu to feature together again | Sakshi
Sakshi News home page

పోరాటానికి సై

Nov 30 2015 6:48 AM | Updated on Sep 3 2017 1:13 PM

పోరాటానికి సై

పోరాటానికి సై

ఫలానా సినిమా ఒప్పుకున్నా అని చెప్పడం చాలా ఈజీ. ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు పడే తర్జన భర్జన ఉంది చూశారూ..

 ‘‘ఫలానా సినిమా ఒప్పుకున్నా అని చెప్పడం చాలా ఈజీ. ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు పడే తర్జన భర్జన ఉంది చూశారూ.. అది మామూలు విషయం కాదు. ముందు కథ వినాలి. ఆ కథ జనాలకు నచ్చుతుందో లేదో ఆలోచించుకోవాలి. ఆ తర్వాత నేను చేయబోయే పాత్ర వర్కవుట్ అవుతుందో లేదో నిర్ణయించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ రెండూ అయ్యాక దర్శకుడి గురించి ఆలోచించాలి’’ అని తాప్సీ అంటున్నారు. మొత్తానికి ఒక సినిమాకి పచ్చజెండా ఊపాలంటే దాదాపు యజ్ఞం చేసినట్లే అని ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. ‘‘అంత జాగ్రత్త తీసుకుంటున్నాను కాబట్టే ఈ రెండేళ్లల్లో హిందీలో నేను చేసిన ‘బేబి’, తమిళంలో ‘ఆరంభం’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘గంగ’ నాకు మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి’’ అన్నారు తాప్సీ.

ఇప్పుడు తాప్సీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘బేబీ’ చిత్రంలో అక్షయ్‌కుమార్‌తో పాటు పోరాట సన్నివేశాల్లో నటించి, భేష్ అనిపించుకున్న ఈ బ్యూటీ తాజా చిత్రంలో కూడా ఫైట్స్ చేయనున్నారట. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2001లో తాను దర్శకత్వం వహించిన ‘తుమ్ బిన్’కి సీక్వెల్‌గా అనుభవ్ సిన్హా ఈ చిత్రం చేయనున్నారు. దీనికి ‘హూంకార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హూంకార్ అంటే గర్జించడం అని అర్థం. మరి.. ఈ చిత్రంలో తాప్సీ ఏ రేంజ్‌లో గర్జిస్తారో చూడాలి. ఇందులో రితేశ్ దేశ్‌ముఖ్, అభయ్ డియోల్ హీరోలుగా నటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement