
తిరువనంతపురం: మలయాళ నటి అనస్వర పొన్నంబత్ త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. మెరైన్ ఇంజనీర్ దిన్శిత్ దినేశ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. కాగా సోమవారం నాటి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అనస్వర తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ‘కథ మొదలైంది..’ అంటూ తన ఎంగేజ్‌మెంట్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో అభిమానులు, నెటిజన్ల నుంచి కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఒరుమయిల్ ఒరు శిశిరం అనే మలయాళ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న అనస్వర.. 2014లో విడుదలైన బాల్యకలాసఖి సినిమాలో నటుడు మమ్ముట్టి కూతురిగా కనిపించారు. డాన్సర్‌గానూ గుర్తింపు పొందిన ఆమె... కంబన్స్- ది ఓనం సాంగ్‌లోనూ తళుక్కుమన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టిక్‌టాక్‌లతో అభిమానులను అలరిస్తూ ఉంటారు.