యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్ | Actress Anikha Surendran Reveals About Her Instagram Account Issue, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Anika Surendran: అభిమానుల సాయం కోరిన హీరోయిన్

Apr 27 2025 2:36 PM | Updated on Apr 27 2025 3:42 PM

Anikha Surendran Instagram Account Issue

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న అమ్మాయి అనికా సురేంద్రన్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలోనూ వరస చిత్రాలు చేస్తోంది. తాజాగా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించింది.

సరే అసలు విషయానికొస్తే ఈమెకు గత రెండు నెలల నుంచి ఓ చిన్న సమస్య ఇ‍బ్బంది పెడుతుందట. ఇన్ స్టాలో తన రీల్స్ కి మ్యూజిక్ జోడిద్దామంటే కుదరట్లేదని చెబుతూ ఫన్నీగా పెట్టిన ఫేస్ ఫొటోని పోస్ట్ చేసింది. తన మిగతా అకౌంట్లకు ఈ ఫీచర్ వర్క్ అవుతుందని కానీ తన అఫీషియల్ అకౌంట్ కి మాత్రం రెండు నెలలుగా అవ్వట్లేదని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు)

సరేలే అని బిజినెస్ అకౌంట్ నుంచి క్రియేటర్ అకౌంట్ గా మార్చినప్పటికీ.. మ్యూజిక్ జోడించే ఫీచర్ మాత్రం కావట్లేదని అనికా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు ఎవరైనా కాస్త చేయండని రిక్వెస్ట్ చేసింది. 

2010లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన అనిక.. తెలుగులోనూ నాగార్జున 'ద ఘోస్ట్'లో చైల్డ్ ఆర్టిస్టుగా, 'బుట్టబొమ్మ'లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఓ తమిళ మూవీలో నటిస్తోంది.

(ఇదీ చదవండి: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement