సమయం వచ్చినప్పుడు నేనేచెప్తా.. | Actor Ali React On His Political Entry In East Godavari | Sakshi
Sakshi News home page

సమయం వచ్చినప్పుడు రాజకీయ ప్రవేశంపై ప్రకటన

Jun 23 2018 6:37 AM | Updated on Sep 17 2018 4:56 PM

Actor Ali React On His Political Entry In East Godavari - Sakshi

అంబాజీపేట (పి.గన్నవరం): తాను రాజకీయాల్లో ప్రవేశించే విషయాన్ని సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని ప్రముఖ  నటుడు అలీ చెప్పారు. ఆయన వద్ద పర్సనల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ముసునూరి వరప్రసాద్‌ వివాహ వేడుక పుల్లేటికుర్రు శివారు జొన్నాడవారిపేటలో శుక్రవారం జరిగింది. వధూవరులు వరప్రసాద్, గీతాంజలిలను అలీ ఆశీర్వదించారు. అనంతరం ముక్కామలలో ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ రంగంలోకి రావడం గురించి అడిగినప్పుడు పై విధంగా చెప్పారు. అలీ రాకతో పెళ్లి పందిరి వద్ద సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీ దిగేందుకు పలువురు ఆత్రుత చూపారు.

1
1/1

వధూవరులతో అలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement