ఉద్దండనేత అంతర్మథనం | political game | Sakshi
Sakshi News home page

ఉద్దండనేత అంతర్మథనం

Oct 22 2016 11:55 PM | Updated on Sep 17 2018 4:56 PM

బాక్సింగ్‌లో మైక్‌ టైస¯ŒSకు ఉన్నంత పేరు జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడికి ఉంది. రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన రాజకీయ దురంధరుడు ఆయన. మూడు దశాబ్ధాలS రాజకీయాల్లో మూడు పార్టీలు మారారు. పార్టీ ఏదైనా హవా మాత్రం అతనిదే. జిల్లాలో ఏ మూలన ఉన్న కార్యకర్తనైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి సీనియర్‌ నాయకుడు అటువంటి నేత ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని మానసిక సంఘర్షణను చవిచూస్తున్నారు.

  • కత్తులతో సమకాలికుల కౌగిలింతలు..
  • చక్రం తిప్పిన ఆ నేత స్థానమేమిటో...
  • చిన్ని చిన్ని ఆశ చిగురుపైనే ధ్యాస
  •  
    లక్కింశెట్టి శ్రీనివాసరావు :
    బాక్సింగ్‌లో మైక్‌ టైస¯ŒSకు ఉన్నంత పేరు జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడికి ఉంది. రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన రాజకీయ దురంధరుడు ఆయన. మూడు దశాబ్ధాలS రాజకీయాల్లో మూడు పార్టీలు మారారు. పార్టీ ఏదైనా హవా మాత్రం అతనిదే. జిల్లాలో ఏ మూలన ఉన్న కార్యకర్తనైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి సీనియర్‌ నాయకుడు అటువంటి నేత ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని మానసిక సంఘర్షణను చవిచూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు ఎంతటి నాయకుడి ప్రాభవాన్నైనా తెరమరుగు చేసేస్తాయనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీలో ఆ నాయకుడు ఒక వెలుగు వెలిగారు. అప్పుడే పుట్టిన ఆ పార్టీలో రాజకీయ అరంగేట్రంతోనే ఒక బలమైన నాయకుడిగా చక్రం తిప్పారు. కానీ ఆ నాయకుడున్న  ప్రాంతానికే చెందిన సమకాలికుడైన మరో బడా నేత వ్యూహాత్మక రాజకీయంతో ఎప్పుడూ అడ్డుపడుతూనే వచ్చాడు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్న సామెత చందంగా వీరిద్దరి రాజకీయ స్నేహం కొనసాగేది.  అన్నేళ్ల రాజకీయాల్లో ఇక అక్కడే కొనసాగితే భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చి అప్పుడే  తెరవేల్పులతో మొగ్గతొడిగి తెరమీదకు వచ్చిన పార్టీలో చేరారు. అక్కడ కూడా అతనిదే హవా. కానీ పరిస్థితులు అనుకూలించక కొద్దికాలం తరువాత ఆ పార్టీ జెండానే పీకేశారనుకోండి. రాజకీయాలు కలిసి రావడం లేదనుకుంటున్న సమయంలో పోరాటాలతో పురిటి గడ్డన lపుట్టిన పార్టీలో చేరారు. అనుభవం, రాజకీయ చతురతకు అక్కడ కూడా మంచి గుర్తింపే ఇచ్చారు. ప్రజలపక్షాన పోరాటం చేసే ఆ పార్టీలో నంబర్‌ టు గా సముచిత ప్రాధాన్యం లభించింది. జిల్లాలో ఆ పార్టీ పగ్గాలు చేపట్టి అటు రాష్ట్రంలోను, ఇటు జిల్లాలో తన ప్రాభవాన్ని తిరిగి కొనసాగించారు.
     
    మంచిని కాలదన్ని...
    మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చిన పార్టీని కాదనుకుని బయటకు వచ్చేశారు. కానీ ఆ సమయంలోనే అంతటి అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఆ నాయకుడు కూడా తప్పటడుగు వేశారని చెప్పకతప్పదు. ఒకప్పుడు తన రాజకీయ ఎదుగుదలకు అడుగడుగునా అడ్డంపడుతున్న నేతతో ఇంటిపోరు పడలేక బయటకు వచ్చి తిరిగి అదే పార్టీ పంచన చేరడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రలోభాలకు గురయ్యా...లేదా మరేదైనా కారణమైనా ఉందా అనే దానిని పక్కనపెడితే అంతటి అనుభవం ఉన్న ఆయన తిరిగి ఆ పార్టీలోకి వెళ్లడం ఒక ఎలై్తతే...తన ఎదుగుదలను అడ్డుకున్న నేత మధ్య వర్తిత్వంలోనే తిరిగి ఆ పార్టీ పంచన చేరడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇదంతా పాత మాట. 
    ఆ పార్టీలోకి తిరిగి  వెళ్లే సందర్భంలో ఆమాత్య పదవి ఖాయమని పార్టీ కోడైకూసింది. కానీ మంత్రివర్గ విస్తరణ జరిగినా ఆ వృద్ధ సింహానికి మాత్రం పదవి దక్కదనేది పాత రాజకీయ శత్రువు వర్గం ప్రచారం చేస్తోంది.అలా అని ప్రచారానికే సనియితం కాకుండా సొంత ప్రాంతంలో కొత్త తలపోట్లు కూడా సృష్టిస్తున్నారు. నమ్మి సముచిత ప్రాతినిధ్యం కల్పించిన పార్టీని వీడి వచ్చినందుకు ఆ నాయకుడు ఇప్పుడు రాజకీయంగా  తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారని అనుచర వర్గం బాధపడుతోంది. ఏ పార్టీలో ఉన్నా జిల్లాను తన కనుసన్నల్లో నడిపించిన నాయకుడు కాస్తా ప్రస్తుతం తన ప్రాంతానికే పరిమితమైపోవడం వారు ఒకపట్టాన జీర్ణించుకోలేకున్నారు. చివరకు నియోజకవర్గంలో తలపోట్లు కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. ఇదివరకు పార్టీలో కొనసాగిన నంబర్‌ టు స్థానం నుంచి గ్రాఫ్‌ దిగజారిపోవడంతో ఆయనలో అంతర్మథనం చెందుతున్నారంటున్నారు.ఇప్పుడు సీ¯ŒS రివర్స్‌ అయింది. ’నలుగురితో నారాయణ..అన్న సామెతను తలపిస్తున్న పరిస్థితి చూస్తే ఆ నేత సమకాలలికులకే నోట మాట రావడం లేదు. కానీ ఎక్కడో ఇంకా ఏదో చిరు ఆశ మాత్రం ఆ నాయకుడిని విడిచిపెట్టడం లేదు. మూడు దశాబ్థాల రాజకీయాల్లో ఆ నాయకుడు కల నిజమవుతుందో లేద గత అనుభవమే పునరావృతమవుతుందో భవిష్యత్తే తేల్చాలి మరి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement