రజనీ నన్ను చేయమన్నారు : ఆమిర్

Rajini Aamir

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 2.0 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శంకర్ 2.0లో నటించమని తనని సంప్రదించినట్టుగా తెలిపారు ఆమిర్.

రోబో సినిమా సీక్వల్ కోసం శంకర్ రజనీని సంప్రదించినపుడు ఆయన ఆమిర్ ను  సంప్రదించాల్సిందిగా సూచించారట. రజనీ మాటకు గౌరవమిచ్చిన శంకర్, ఆమిర్ ను కలిసి కథ వినిపించారు. రజనీ కాంత్ కూడా స్వయంగా ఆమిర్ కు ఫోన్ చేసి మరి 2.0లో నటించాల్సిందిగా కోరారు. అయితే రోబో చిట్టి క్యారెక్టర్ కు రజనీనే సూట్ అవుతారని భావించిన ఆమిర్, 2.0లో నటించేందుకు అంగీకరించలేదు. దీంతో రజనీనే 2.0లో హీరోగా నటిస్తున్నారు'. సీక్రెట్ సూపర్ స్టార్ ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top