
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 2.0. గతంలో ఇదే కాంబినేషన్ లో ఘనవిజయం సాధించిన రోబో కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ మరోసారి రోబోగా దర్శనమివ్వనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
ఈచిత్రం విడుదలపై లైకా ప్రొడక్షన్స్ తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు చెక్‌పెడుతూ విడుదలకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. 2018 ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్‌లో ప్రకటించింది. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా అలరించనున్నాడు.
Official Press Release: "2.0" - to hit screens on April 2018#2Point0 #April2018 pic.twitter.com/fql98ZXWVY
— Lyca Productions (@LycaProductions) December 2, 2017