
రోబో 2.0 టీజర్ వేడుక హైదరాబాద్‌లోనే..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు.
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి రోబో 2.0. రూ.400 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అణువణువూ చెక్కుతున్నారు. ఇందులో ఎమీజాక్సన్ కథానయికగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటేవలే ఒక్క పాట మినహా మొత్తం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దర్శకుడు శంకర్ ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.
ఈ చిత్రం విడుదల కోసం రజనీకాంత్ అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. వారి కోసం చిత్ర నిర్మాత, లైకా సంస్థ అధినేత రాజుమహాలింగం ఓప్రకటన చేశారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ అక్టోబరు నెల 27వ తేదీన దుబాయ్‌లోని బుర్జ్‌పార్క్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వేదికపై చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బ్రహ్మండ సంగీత కచ్చేరి ఉంటుందని చెప్పారు.
అదే విధంగా టీజర్ రిలీజ్ వేడుకను నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ట్విట్లర్‌లో ప్రకటించారు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదినం రోజు డిసెంబర్ 12న చెన్నైలో 2.0. చిత్ర ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. 2018 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజుమహాలింగం వెల్లడించారు.
"Festivities to Begin" Come Oct -Audio Release in Dubai!!! Nov-Teaser in Hyderabad and Dec-Trailer in Namma Singara Chennai!!! 2.0 Loading!!
— Raju Mahalingam (@rajumahalingam) September 7, 2017