ప్రణయం, ప్రళయం కలిస్తే ఈ ప్రేమ | Yeto Vellipoyindi Manasu Love Movie Review | Sakshi
Sakshi News home page

ప్రణయం, ప్రళయం కలిస్తే ఈ ప్రేమ

Nov 7 2019 3:29 PM | Updated on Nov 7 2019 6:41 PM

Yeto Vellipoyindi Manasu Love Movie Review - Sakshi

ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలోని ఓ దృశ్యం

ఇదే వారిద్దరి మధ్యా గొడవకు దారి తీస్తుంది! ఇద్దరూ విడిపోతారు....

సినిమా : ఎటో వెళ్లిపోయింది మనసు
తారాగణం : నాని, సమంత, క్రిష్ణుడు, విద్యు
డైరెక్టర్‌ : గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌

కథ : వరుణ్ కృష్ణ (నాని), నిత్య(సమంత) చిన్ననాటి స్కూల్ ప్రెండ్స్, తర్వాత కాలేజ్ మేట్స్, ఆ తర్వాత సోల్ మేట్స్. అయితే ఇద్దరూ తమ తమ అహాలతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు! మళ్లీ కలిసిపోతుంటారు. అయితే ఈ నేపథ్యంలో వరుణ్‌ అన్న పెళ్లి విషయంలో అతడి కుటుంబం అవమానానికి గురవుతుంది. దీంతో వరుణ్‌ కుటుంబంకోసం ఏదైనా చేయాలనుకుంటాడు. నిత్యకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెడతాడు. ఇదే వారిద్దరి మధ్యా గొడవకు దారి తీస్తుంది! ఇద్దరూ విడిపోతారు. వరుణ్‌ ఉన్నత చదువుల నిమిత్తం కోయికోడ్‌ వెళ్లిపోగా, నిత్య సునామీ బాధితులకు సేవ చేస్తూ గడుపుతుంటుంది.

కొన్నేళ్ల తర్వాత వరుణ్‌, నిత్యను చూడాలని వెనక్కు వచ్చేస్తాడు. నిత్య ఉన్న చోటుకు వెళ్లి ఆమెను కలుస్తాడు. ఆమె కొప్పడుతుంది, వెళ్లిపోమని తిడుతుంది. నిత్య కోపాన్ని చల్లబర్చడానికి ప్రయత్నించి వరుణ్‌ భంగపడతాడు. చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోతాడు. అక్కడ పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లికి కొన్ని గంటల ముందు వరుణ్‌ పెళ్లి విషయం నిత్యకు తెలుస్తుంది. తన ప్రేమను దక్కించుకోవటానికి నిత్య ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? చివరకు ఇద్దరు కలుస్తారా? లేదా? అన్నదే మిగితా కథ.

విశ్లేషణ : ఫుల్‌ లెన్త్‌ రొమాంటిక్‌ మూవీ ఇది. వరుణ్‌, నిత్యల జీవితాల్లో 8 ఏళ్ల వయస్సునుంచి 24 ఏళ్ల వరకు చోటుచేసుకునే సంఘటనలే ఈ సినిమా. నాని, సమంతలు తమ పాత్రల్లో జీవించారని చెప్పొచ్చు. ఇద్దరి మధ్యా చోటుచేసుకునే చిన్నచిన్న ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. మేస్ట్రో ఇళయరాజా సంగీతం మనల్ని మైమరిపిస్తుంది.  సినిమా క్లైమాక్స్‌లోని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రేమికులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement