తొలిచూపులో ప్రేమ.. నిజమేనా?

Love At First Sight Is Real - Sakshi

న్యూయార్క్‌ :  ఓ వ్యక్తిని చూసిన మొదటి చూపులోనే ప్రేమ పుట్టడం అన్నది ఆలోచనలకు మామూలుగా అనిపించినా.. అనుభవించిన వారికి మాత్రం ప్రత్యేకమైనది. అంతవరకు పరిచయం లేని ఓ వ్యక్తిని చూడగానే ప్రేమ కలగటం.. వారితో వెనకజన్మ బంధమోదో ఉన్నట్లుగా అనిపించటం తొలిచూపులో కలిగే ప్రేమకున్న ప్రత్యేకత. దీన్ని కొంతమంది గట్టిగా విశ్వసిస్తుంటే మరికొంతమంది అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.  ‘‘తొలిచూపులోనే ప్రేమ పుడుతుందన్న విషయాన్ని మీరు నమ్ముతారా?’’  అని ఓ ప్రముఖ డేటింగ్‌ సైట్‌ నిర్వహించిన సర్వేలో ప్రశ్నించినపుడు 60 శాతం మంది ఆడవాళ్లు, 70 శాతం మంది మొగవాళ్లు తొలిచూపు ప్రేమ నిజమని ఓటేశారు. తొలిచూపులో కలిగే ప్రేమతో ఏర్పడ్డ చాలా బంధాలు చివరివరకు నిలిచి ఉన్నాయని సదరు సర్వే వెల్లడించింది.

కాగా, ఓ వ్యక్తిని మొదటిసారి చూడగానే మన మెదడులో చోటుచేసుకున్న రసాయనికి మార్పులే దీనికి కారణమంటున్నారు అమెరికాకు చెందిన కొందరు న్యూరోసైకోథెరపిస్టులు. మెదడులో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఎదుటి వ్యక్తిపై బలమైన ఆకర్షణ మొదలవతుందని చెబుతున్నారు. చాలా మంది ఈ ఆకర్షణననే ప్రేమగా భావిస్తారని పేర్కొన్నారు. అయితే ఇది ప్రత్యేకమైన ప్రేమ కాదని, జ్ఞాపకాలకు సంబంధించినది మాత్రమేనని వారు భావిస్తున్నారు. ఇది తొలిచూపులో ప్రేమ కాదని, ఆకర్షణ అని అంటున్నారు. అయితే ఈ తొలిచూపు ప్రేమ(?)తో ఏర్పడ్డ బంధాలలో కొన్ని మాత్రమే ఎక్కువకాలం కొనసాగాయని తేల్చారు. తొలిచూపులో ప్రేమ(?)పుట్టనంత మాత్రాన ఎదుటి వ్యకితో బంధాలను తక్కువగా అంచనా వేయటానికి లేదంటున్నారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top