ఉపాసనకు థాంక్స్‌: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

WHO Chief Thanked Upasana For Sharing Video Thanks Health Heroes Campaign - Sakshi

‘‘మా #ThanksHealthHeros క్యాంపెయిన్‌లో భాగస్వామ్యమైనందుకు, భారత్‌ నుంచి ఈ సవాలు స్వీకరించినందుకు ఉపాసన కొణిదెలకు ధన్యవాదాలు. అదే విధంగా కోవిడ్‌-19 కట్టడికై పోరాడుతూ.. మనందరినీ ఆరోగ్యంగా, భద్రంగా ఉంచుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రుణపడి ఉంటా. అంతా కలిసికట్టుగా ఉందాం’’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గేబ్రియేసెస్‌ మెగా కోడలు ఉపాసన పేరును ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్‌ 7)సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ #ThanksHealthHeros హ్యాష్‌ట్యాగ్‌ పేరిట వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఉపాసన కరోనాతో పోరుకు సిద్ధమై.. అంకితభావంతో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో సందేశం ట్విటర్‌లో షేర్‌ చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ, టెడ్రోస్‌, తెలంగాణ సీఎంఓను ట్యాగ్‌ చేశారు. ఇందుకు బదులిచ్చిన టెడ్రోస్‌ ఉపాసన ప్రయత్నాన్ని ప్రశంసించారు.(అమెరికా ఆ పని చేయదనుకుంటున్నాం: డబ్ల్యూహెచ్‌ఓ)

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏప్రిల్‌ 7న వరల్డ్‌ హెల్త్‌ డే నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. 2020 ఏడాదికి గానూ నిర్దేశించుకున్న ఉద్దేశం/ నినాదం (స్లోగన్‌) ‘అందరికీ ఆరోగ్యం’.ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి విలవిల్లాడుతున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి మానవాళిని రక్షిస్తున్న వైద్య సిబ్బంది పట్ల ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతా భావం చాటుకునే అవకాశాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఇచ్చింది.

ఇక అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన హెల్త్‌కేర్‌ విభాగంలో ఉపాసన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుండటంతో పాటుగా అనేక అంతర్జాతీయ సదస్సులకు ఆమె హాజరవుతారు. ఈ క్రమంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో గతేడాది మహాత్మా గాంధీ అవార్డును ఉపాసన సొంతం చేసుకున్నారు. కాగా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఉపానస... కరోనా కాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు, డైట్‌ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లను షేర్‌ చేస్తున్నారు.(‘కరోనా’పై ఉపాసన ట్వీట్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top