‘కరోనా’పై ఉపాసన ట్వీట్‌

Covid 19: Upasana Konidela Suggested Precautions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా (కోవిడ్‌ 19) కోరలు చాస్తోంది. దాదాపు 60 దేశాల్లోకి విస్తరించిన ఈ వైరస్ తెలంగాణలోనూ ప్రవేశించింది. రాజధాని హైదరబాద్‌లో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. దుబాయ్‌ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన పేషంట్‌ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేష్‌, అపోలో లైఫ్‌ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన  సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

(చదవండి: కరోనా అలర్ట్: ‘అలా చేస్తే కఠిన చర్యలు)

సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు.

ఉపాసన చెప్పిన జాగ్రత్తలు
జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి ఉంటే కరోనా సోకినట్లు భావించాలి. వెంటనే వారు వైద్యుడిని సంప్రదించాలి
ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి మందు(మెడిసిన్‌) లేదు. మందులు వాడితే సరిపోతుందని భ్రమ పడకండి. వెంటనే ఆస్పత్రికి వెళ్లండి
హోమియోపతి ఉందని అంటున్నారు.. కానీ ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదు
చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మాస్కులు తప్పని సరిగా వాడండి
జంతువుల ద్వారా ఈ వైరస్‌ సోకుతుందని అంటున్నారు. కానీ ఇది ఇంత వరకూ నిర్ధారణ కాలేదు.
►  మాంసం తినడం వల్ల  కరోనా వైరస్‌ సోకదు. మంసాన్ని బాగా ఉడికించి తినండి
మీ పిల్లలకు కానీ, పెద్ద వారికి కానీ  దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయకండి.
ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం. ఈ విషయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top