ఈ తండ్రీకూతురు చెత్తను ఎలా పడేస్తారంటే?

Spain Father And Daughter Duo Wear Special Dress To Throw Trash - Sakshi

స్పెయిన్‌కు చెందిన ఆ తండ్రీకూతుర్లు చెత్తను పడేయటానికి ఓ వెరైటీ పద్దతిని ఫాలో అవుతున్నారు. ఇంటినుంచి చెత్త పారేసేందుకు బయటికి వెళ్లిన ప్రతీసారి ఫేమస్‌ హాలీవుడ్‌ సినిమా పాత్రల్లా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెబుతున్న నేపథ్యంలో జామీ అనే వ్యక్తి ఈ నిర్ణయానికి వచ్చాడు. మొదట్లో  జామీ ఒకడే వెరైటీ దుస్తుల్లో చెత్త పడేయటానికి వెళ్లేవాడు. ఆ తర్వాతినుంచి కూతుర్ని కూడా వెంట బెట్టుకెళుతున్నాడు. ( ఇది చూసి హాయిగా న‌వ్వేయండి: అమితాబ్‌ )

ఇప్పటివరకు వారు ప్రముఖ హాలీవుడ్‌ సినిమాలకు సంబంధించిన పాత్రలు బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌, డ్రాగన్‌ బాల్‌ జెడ్‌, ఫ్రోజెన్‌, టాంగ్లడ్‌, స్పైడర్‌ మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, వండర్‌ ఉమన్‌ తదితరాలకు సంబంధించిన దుస్తులు ధరించారు. ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు వింత దుస్తుల్లో చెత్త పారేయటానికి వెళుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను చూస్తున్న నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top