పారిస్ ఉగ్రదాడి సూత్రధారి కోసం వేట; ఇద్దరి మృతి | Shooting during police operation on northern edge of Paris | Sakshi
Sakshi News home page

పారిస్ ఉగ్రదాడి సూత్రధారి కోసం వేట; ఇద్దరి మృతి

Nov 18 2015 10:20 AM | Updated on Sep 17 2018 6:26 PM

పారిస్ ఉగ్రదాడి సూత్రధారి కోసం వేట; ఇద్దరి మృతి - Sakshi

పారిస్ ఉగ్రదాడి సూత్రధారి కోసం వేట; ఇద్దరి మృతి

పారిస్ ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబోద్ కోసం ప్రాన్స్ భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి.

పారిస్: పారిస్ ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబోద్ కోసం ప్రాన్స్ భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం ఉత్తర పారిస్లో అబ్దెల్ హమీద్ అబోద్ లక్ష్యంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు మరణించగా, వీరిలో ఓ మహిళా ఉగ్రవాది ఉంది. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో పలువురు పోలీసులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది.

ఉత్తర పారిస్లో ప్రత్యేక సాయుధ బలగాలు సోదాలు చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తారసపడటంతో కాల్పులు జరిపారు. తెల్లవారుజాము 4 గంటలకు కాల్పులు మొదలయ్యాయి. బలగాలకు, అనుమానితులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఓ అపార్ట్మెంట్లో అబ్దెల్ హమీద్ అబోద్ దాక్కున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసుల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

పారిస్ ఉగ్రవాద దాడుల అనంతరం ప్రాన్స్ భద్రత దళాలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement