భార్యపై రేప్ కేసు పెట్టిన భర్త! | Seoul court acquits wife of raping husband | Sakshi
Sakshi News home page

భార్యపై రేప్ కేసు పెట్టిన భర్త!

Sep 9 2016 2:15 PM | Updated on Sep 4 2017 12:49 PM

భార్యపై రేప్ కేసు పెట్టిన భర్త!

భార్యపై రేప్ కేసు పెట్టిన భర్త!

ఆశ్చర్యకరంగా భార్యపై భర్త రేప్ కేసు పెట్టిన ఘటన దక్షిణ కొరియాలో వెలుగులోకి వచ్చింది.

సియోల్: మహిళలపై లైంగిక దాడులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. ఆశ్చర్యకరంగా భార్యపై భర్త రేప్ కేసు పెట్టిన ఘటన దక్షిణ కొరియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో నిందితురాలిని కోర్టు నిర్దోషిగా తేల్చడం విశేషం. శృంగారం కోసం తన భార్య షిమ్ బలవంతం చేసిందని కిమ్ అనే వ్యక్తి సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటింది.

భాగస్వామితో బలవంతపు శృంగారం సరికాదని షిమ్ కు కోర్టు హితపు పలికింది. భార్యతో సఖ్యతతో మెలగాలని కిమ్ కు సూచించింది. అయితే భర్తను 29 గంటల పాటు ఇంట్లో నిర్బంధించి, అతడిని గాయపరిచినందుకు షిమ్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివాహ అనంతరం భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని(మారిటల్ రేప్) 2013లో సుప్రీంకోర్టు నేరంగా గుర్తించిన తర్వాత ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement